News March 12, 2025

చింతలమానేపల్లి: స్థానిక సంస్థల్లో కమలం వికసించాలి: ఎమ్మెల్యే

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం చింతనమానేపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు కమలం వికసించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం బీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు..!

image

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 25, 2025

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

గువాహటిలోని <>కాటన్ యూనివర్సిటీ<<>> 3 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, MCA, PGDCA/DCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.cottonuniversity.ac.in

News November 25, 2025

ములుగు: మండలాల వారీగా వడ్డీ లేని రుణాల పంపిణీ ఇలా..!

image

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ములుగు జిల్లాలో రూ.2.7కోట్లను మహిళా పొదుపు సంఘాలకు ఈరోజు అందజేసింది. ఏటూరునాగారంలో రూ.21.89లక్షలు, గోవిందరావుపేటలో రూ.28.46లక్షలు, కన్నాయిగూడెంలో రూ.3.58లక్షలు, మంగపేటలో రూ.49.74, ములుగులో రూ.59.65లక్షలు, తాడ్వాయిలో రూ.5.19 వెంకటాపూర్‌లో రూ.21.84లక్షలు, వాజేడులో రూ.2.81లక్షలు, వెంకటాపురంలో రూ.13.84 లక్షల రుణాలు ఇచ్చారు.