News April 19, 2024
చింతూరులో ఎంపీటీసీ దారుణ హత్య

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కన్నయ్య గూడెంలో ఎంపీటీసీ సభ్యుడు వర్ష బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
News December 13, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 311 మంది గైర్హాజరు

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 4,501 మంది అభ్యర్థులకు గానూ 4,190 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ ఒక పరీక్ష కేంద్రాన్ని.. ఫ్లైయింగ్ స్క్వాడ్ 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 13, 2025
ఏయూ తెలుగు విభాగం రికార్డ్: 52 మందికి ఉపాధ్యాయ కొలువులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అరుదైన రికార్డు సృష్టించింది. మెగా డీఎస్సీ-2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వీరిని శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఏ.నరసింహారావు పాల్గొని కొత్త టీచర్లను అభినందించారు. వందేళ్ల ఏయూ చరిత్రలో ఇదొక మధుర ఘట్టమని ఆచార్య అప్పారావు పేర్కొన్నారు.


