News January 28, 2025
చింతూరులో మావోయిస్టు చందన మిశ్రా అరెస్ట్

సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి చందన మిశ్రా (నగేశ్)ను చింతూరులో అరెస్టు చేసినట్లు చింతూరు ఎస్సై రమేశ్ సోమవారం మీడియాకు తెలిపారు. 2018 నుంచి మావోయిస్టు పార్టీలో ఆంధ్ర – ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో క్రియాశీలకంగా ఇతను పనిచేస్తున్నాడన్నారు. చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందు పాతర పేల్చిన కేసులో నిందితుడని తెలిపారు.
Similar News
News November 18, 2025
సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.
News November 18, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
News November 18, 2025
హనుమకొండ: భవితశ్రీ చిట్‌ఫండ్ ఎండీ అరెస్ట్

భవితశ్రీ చిట్ ఫండ్ ఎండీ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ పరారీలో ఉండగా హనుమకొండ పోలీసులకు చిక్కాడు. కోట్లాది రూపాయలు చిట్టి సభ్యులకు ఎగవేసి, మోసం చేసి పరారీలో ఉన్న శ్రీనివాస్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


