News April 8, 2025
చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.
Similar News
News October 29, 2025
మొంథా ఎఫెక్ట్.. ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్!

మొంథా తుఫాను ఎఫెక్ట్ కారణంగా ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రైతులు, ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక అధికారులు ఆయా ప్రాంతాల్లోని రైతులను, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
News October 29, 2025
14 గంటలు ఆలస్యంగా అగర్తలా హంసఫర్ రైలు

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
News October 29, 2025
జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.


