News November 20, 2024

చింతూరు: ఒకేరోజు 40 కిలోల గజాలు పట్టివేత

image

చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు 40 కిలోల గంజాయి పట్టుబడింది. బైక్‌పై 10 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డొంకరాయి ఎస్ఐ శివకుమార్ అరెస్ట్ చేశారు. మోతుగూడెం ఎస్ఐ శివన్నారాయణ రెండు బైకులపై తరలిస్తున్న 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 20, 2024

UPDATE ఖమ్మం: ప్రారంభమైన రైళ్ల పునరుద్ధరణ

image

డోర్నకల్ సమీపంలో ఓ గూడ్స్ రైల్ ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను రైల్వే అధికారులు క్లియర్ చేశారు. దీంతో సుమారు రెండు గంటల పాటు డోర్నకల్ సమీపంలో ఆగిన ఇంటర్ సిటీ, కృష్ణ ఎక్స్ ప్రెస్ రైళ్లు ముందుకు కదిలాయి. రైళ్ల రాకపోకలకు మరింత ఆలస్యం అవుతుందని గుర్తించిన కొంతమంది ప్రయాణికులు ఆ రైళ్లు దిగి వేరే మార్గంలో వెళ్లిపోయారు. ‌వారు వెళ్లిన కాసేపటికే రైళ్ల పునరుద్ధరణ ప్రారంభమైంది.

News November 20, 2024

రేపు ఖమ్మంలో జరిగే ర్యాలీని జయప్రదం చేయండి

image

ఈ నెల 21న ఖమ్మంలో లగచర్ల రైతులకు సంఘీభావంగా ఏర్పాటుచేసిన ర్యాలీలో మండలం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News November 20, 2024

కల్లూరు డివిజన్లో 63% సమగ్ర సర్వే పూర్తి 

image

కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాలలో సమగ్ర సర్వే 63% పూర్తి చేసినట్లు ఆర్డీఓ రాజేందర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లూరు, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, ఏన్కూర్ మండలాలలో, 1,03,453 కుటుంబాలకు గానూ 64,483 కుటుంబాల సర్వే జరిగినట్లు ఆర్డీఓ వివరించారు. ఈనెల 24వ తేదీ వరకు దాదాపు సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు, కృషి చేస్తున్నట్లు ఆర్టీఓ అన్నారు.