News June 23, 2024
చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన కలెక్టర్

నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.
Similar News
News December 15, 2025
ఆస్తి కోసం వేధింపులు.. కొడుకుపై ఎస్పీకి వృద్ధురాలి ఫిర్యాదు

ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీని కలిసి తన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా పంచి, తాను వేరుగా ఓ ఇంట్లో భర్తతో ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఆ ఇంటిని కూడా ఇవ్వాలంటూ తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన భర్తను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు ఎస్పీని కోరారు.
News December 15, 2025
నెల్లూరులో వాజ్పేయి విగ్రహావిష్కరణ

నెలూరులో సోమవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ.. వాజ్పేయి చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు.
News December 15, 2025
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరజీవి

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన మరణంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పడమటి పల్లి ఆయన పూర్వీకుల స్వగ్రామం కావడంతో అమరజీవి గౌరవార్థం ఆయన పేరు నెల్లూరు జిల్లాకు పెట్టారు.


