News June 24, 2024
చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన కలెక్టర్
నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.
Similar News
News November 4, 2024
నెల్లూరు: బాలిరెడ్డిపాలెంలో విషాదం.. బాలుడు మృతి
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బాలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన చరణ్(14)ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు బాలుడిని బాలిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి మూసేసి ఉంది. గూడూరుకి తరలించేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో వైద్యం అందుంటే బతికుండేవాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
News November 4, 2024
వెంకటగిరి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
బాలాయపల్లి మండలంలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మండంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 9వ తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరకున్న చిన్నారి బంధువులను చూసి నిందితుడు పరారయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
News November 4, 2024
నెల్లూరు: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని వేమారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. రాగాల యాచేంద్ర, తేజస్విని(20)కి రెండేళ్ల క్రితం వివాహం అయింది. సంతానం లేకపోవడంతో యాచేంద్ర ఆమెను నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులకు తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.