News February 5, 2025

చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన పరమేశ్ నాయుడు(22) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ముచ్చుమర్రి ఏఎస్ఐ శేషయ్య వెల్లడించారు. ఐటీఐ చదివి వ్యవసాయం చేసుకుంటున్న పరమేశ్.. గత నెల 27న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News November 15, 2025

ASF: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి వినతి

image

ఆసిఫాబాద్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని అభ్యర్థించారు. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వినతి పత్రం అందజేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చాడ వెంకటరెడ్డి భరోసానిచ్చారు. నాయకులు తారు, అబ్దుల్ హన్నాన్, రాధాకృష్ణ చారి పాల్గొన్నారు.

News November 15, 2025

SSMB29: టైటిల్ ‘వారణాసి’

image

రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. అలాగే మహేశ్ క్యారెక్టర్‌ను రుద్రగా పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేశ్ నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. GlobeTrotter పేరుతో ప్రస్తుతం RFCలో ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది.

News November 15, 2025

‘ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి’

image

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. అనంతరం ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, వసతి సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఈడీ సురేష్ కుమార్, ఇతర అధికారులతో సమీక్షించారు.