News March 9, 2025
చికిత్స పొందుతూ రాజన్నపేట యువకుడు మృతి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకి చెందిన నమలికొండ నూతన్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. 2 నెలల క్రితం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట చేస్తూ కళ్ళు తిరిగి స్టవ్పై పడిపోవడంతో వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా సగభాగం శరీరం అంటుకుందని వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
Similar News
News October 23, 2025
సోయా పంట కొనుగోలు ఎప్పుడు?

TG: ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట చేతికొచ్చి 15 రోజులు దాటింది. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. పంట సేకరిస్తుండగా ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,328గా ఉంది. వర్షాలతో కొంత పంట నష్టపోయామని, మిగిలిన పంటనైనా ప్రభుత్వం త్వరగా కొనాలని రైతులు కోరుతున్నారు.
News October 23, 2025
ఆదిలాబాద్ TO అరుణాచలానికి RTC బస్సు

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి తమిళనాడు అరుణాచలం గిరిప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి తెలిపారు. ఈ బస్సు నవంబర్ 8న బయలుదేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు జోగులాంబ దేవాలయం చూసుకొని నవంబర్ 11న రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News October 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.