News March 6, 2025
చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 17, 2026
NTR: గంజాయి పరీక్షల్లో సంచలనం.. 30 ఏళ్ల లోపు వారికే పాజిటివ్..!

NTR జిల్లాలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ ముమ్మరంగా సాగుతోంది. అనుమానితులు, రౌడీషీటర్లు, డ్రగ్ కిట్లతో పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 1600 మందిలో 250 మందికి పాజిటివ్ వచ్చింది. బాధితుల్లో ఎక్కువ మంది 18-30ఏళ్ల యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తొలిసారి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు, రెండోసారి దొరికితే పీడీ వారెంట్ కింద ఏడాదిపాటు బెయిల్ రాని సెక్షన్లతో జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
News April 17, 2026
ADB: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జరీ పరీక్ష రద్దు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు
News April 17, 2026
వికారాబాద్: జోరుగా ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమాలు

వికారాబాద్ జిల్లాలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజును ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’గా నిర్వహించి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రహదారి భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.


