News February 1, 2025

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు వివరాలిలా.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన మహ్మద్ నన్నేసాబ్ (33) ఇటీవల భువనగిరి బై పాస్‌లోని నల్గొండ ఫ్లై ఓవర్ సమీపంలోన రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

Similar News

News February 7, 2025

PPM: జిల్లా వ్యాప్తంగా రిజర్వుడ్ షాపులకు 12 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 12 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. సాలూరు- 2, పార్వతీపురం- 2, వీరఘట్టం -5, పాలకొండ -3 దరఖాస్తులు అందినట్లు ఆయన వివరించారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 10న లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.

News February 7, 2025

సూర్యపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపర్చగా జడ్జి అతడికి శిక్ష విధించారు.

News February 7, 2025

శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి

image

యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.

error: Content is protected !!