News March 8, 2025
చికెన్ టేస్ట్ చేసిన నెల్లూరు కలెక్టర్

నెల్లూరు వీఆర్సీ మైదానంలో చికెన్ & ఎగ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ చికెన్ మేళాను కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చికెన్ను నిర్భయంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మకండి అని ప్రజలకు సూచించారు. అలాగే జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చికెన్ టేస్ట్ చేశారు.
Similar News
News November 12, 2025
కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. <<18262552>>హైకమాండ్<<>>(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.
News November 12, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా 19,678 గృహ ప్రవేశాలు

జిల్లాలో PMAY కింద పూర్తి చేసిన 19,678 గృహాల ప్రవేశం బుధవారం జరగనుంది. అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేశారు.అదే విధంగా PMAY కింద 2.0 పథకం కింద మరో 2,838 మందికి గృహాలను మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఆవాస్ ప్లస్-2024 సర్వేలో భాగంగా గ్రామీణ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు జరుగనుంది.
News November 11, 2025
18న రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోనున్న కలెక్టర్

నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో ‘జల్ సంచయ్ జన్ భగీధారి 1.0’ నేషనల్ అవార్డు లభించింది. నవంబర్ 18న న్యూఢిల్లీలో ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుకోనున్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ గంగాభవాని కలెక్టర్కు అభినందనలు తెలిపారు,


