News March 24, 2024

చిగుళ్ల సుమలతను అభినందించిన పల్నాడు కలెక్టర్

image

నవ యువతరం ఫౌండేషన్ సేవాసంస్థ అధినేత, ఫౌండర్ చిగుళ్ల సుమలతను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించారు. సేవా సంస్థ ద్వారా సమాజానికి అందించిన సేవలకు, వివిధ రంగాలలో కనపరిచిన ప్రతిభను చూసి ఆమెకు ఉమెన్స్ వరల్డ్  రికార్డ్సు అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరప్రదేశ్ ఉమెన్ ఐకాన్-2024 అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సేవలు ఇంకా సమాజానికి అందించాలని కలెక్టర్ అన్నారు.

Similar News

News April 19, 2025

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2025

GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.

News April 19, 2025

GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

error: Content is protected !!