News December 3, 2024
చిట్టమూరు: వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది వీరే

చిట్టమూరు మండల పరిధిలోని తాగెడు సమీపంలో ఉన్న బాలచంద్ర రెడ్డి భవనం దగ్గరలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇందులో మంగళవారం ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వాగు దాటుతుండగా బైకుతో సహా కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. వారు నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుఖ్‌గా స్థానికులు గుర్తించారు. కాగా వారి ఆచూకీ ఇంకా కానరానట్లు తెలుస్తోంది.
Similar News
News February 12, 2026
నెల్లూరు: మినీ గోకులాల నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు..!

నిబంధనలకు విరుద్ధంగా మినీ గోకులాలు నిర్మాణాలు చేపట్టి రాయితీలు పొందుతున్నారు. కొండాపురం(M) ఇసకదామెర్లలో ప్రభుత్వ భూమిలో పోజిషన్ సర్టిఫికెట్స్‌ను అడ్డదారిలో పొంది సబ్సిడీపై షెడ్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ పైపులు వెళ్లే మార్గంలో దీన్ని చేపట్టడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా స్పందించలేదట. ఉన్నతాధికారులు స్పందించకపోతే ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంది.
News February 12, 2026
నెల్లూరు: సముద్రపు బిడ్డల వింత ఆచారం..!

నెల్లూరు జిల్లాలో సుమారు 169 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఈ మత్స్యకారులైన ‘పట్టపు’ సామాజిక వర్గం తమ విలక్షణమైన ఆచారాలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. వీరి భాషలో తెలుగు, తమిళం కలగలిసిన యాస వినడానికి ఎంతో వింతగా ఉంటుంది. సముద్రాన్ని దైవంగా భావించే వీరు, వేటకు వెళ్లేముందు చేసే గంగమ్మ పూజలు అపురూపంగా ఉంటాయి. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల కట్టుబాట్లను గౌరవిస్తూ, ఐకమత్యంగా జీవించడం వీరి గొప్పతనం.
News February 12, 2026
నెల్లూరు: ఆ రెండూ పార్టీలు ఎక్కడ..?

TDP, జనసేన, BJP కలిసి కూటమిగా ఏర్పడినా ఆ రెండు పార్టీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా మారుతోంది. కూటమిలో జనసేన, BJPలతో టీడీపీ సఖ్యతతో నడవడం లేదంట. జనసేనలో నాయకత్వ పగ్గాలు మోసే వారు కరవయ్యారు. యాక్టీవ్‌గా ఉన్న నేతలు ఇప్పటికే సైడ్ అయిపోయారు. తమకు కూటమితో సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పాత పద్ధతిలోనే పోరాడుతోంది. జిల్లాలో 3 పార్టీలదీ తలో దారి అన్నట్టుగా మారింది.


