News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News October 19, 2025
జగిత్యాల: 6 నెలలుగా రేషన్ డీలర్లకు అందని కమీషన్

రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా వారికి రావలసిన కమీషన్ అందడం లేదు. జిల్లాలో 592 రేషన్ షాపులు ఉండగా.. మొత్తం 3,48,058 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 6500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.140 చొప్పున కమీషన్ ఇస్తుండగా, ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్రం రూ.50 చెల్లిస్తోంది. అయితే గత మే నెల నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ రావడం లేదు.
News October 19, 2025
మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్‌ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్‌లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
గీసుగొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గొర్రెకుంట బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ల్యాదెళ్ల రాజు(38)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.