News March 22, 2025

చిట్యాల మండల వాసులైన ఇద్దరికి ప్రభుత్వ కొలువులు

image

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కొలువుల ఫలితాల్లో చిట్యాల మండల వాసులైన ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. జూకల్‌కు చెందిన దొంతు మాధవరెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిఆర్ శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా సెలెక్ట్ కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను తీసుకున్నట్లు వారు చెప్పారు.

Similar News

News November 17, 2025

సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

image

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 17, 2025

జగిత్యాల: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారి(7)పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI గీత తెలిపారు. శనివారం రాత్రి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. దీంతో బాపుపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.