News July 20, 2024
చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
చిట్యాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పట్టణానికి చెందిన మహిళ సంగిశెట్టి సుగుణమ్మ (69) మృతి చెందారు. బంధువుల వివరాలిలా.. సుగుణమ్మ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. భుజం వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతోపాటు, తలకు బలమైన గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది.
Similar News
News October 13, 2024
తుంగతుర్తి: వేలంపాటలో దుర్గామాత చీరను దక్కించుకున్న ముస్లింలు
తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.
News October 13, 2024
NLG: పత్తి రైతుకు దక్కని మద్దతు ధర
నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.
News October 12, 2024
NLG: గోపాలమిత్రలు సేవలు భేష్
గోపాలమిత్రలు ఆపదలో ఉన్న పశుపోషకులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం వీరు వెళ్లి పశువులకు పశువైద్యం అందిస్తున్నారు. పండగ వేళల్లో సైతం తమ సేవలను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని గోపాలమిత్రల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ కోరారు.