News April 12, 2025
చిట్వేలు: ఆ కాలేజీలో ఒక్కరే పాస్

చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఒకే విద్యార్థిని ఆనందల మల్లిక ఉత్తీర్ణులయ్యారు. 474 మార్కులకు గానూ 294 మార్కులు సాధించారు. 78 మంది పరీక్షలు రాస్తే 77 మంది ఫెయిలయ్యారు. చిట్వేలులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ లేకుండానే సంవత్సరం పూర్తి అయిపోయింది. అధికారులు లెక్చరర్లను నియమించాల్సి ఉంది.
Similar News
News October 20, 2025
మనోహరాబాద్: కూలి పనులకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి

కూలి పనుల నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పటాన్చెరు మండలం పెద్దకంచర్లకు చెందిన మన్నే మల్లేష్(35) కూలి పనుల కోసం మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు వచ్చాడు. శనివారం రాత్రి వేళ దీపక్ దాబా సమీపంలో హైవే రోడ్డు దాటుతుండగా తూప్రాన్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 20, 2025
జనగామ: ‘పది’ ప్రత్యేక తరగతులు

పదో తరగతి వార్షిక పరీక్షల వరకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం జనగామ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు సబ్జెక్టు టీచర్ల పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. రోజుకో సబ్జెక్టు చొప్పున స్టడీ అవర్స్, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
News October 20, 2025
PDPL: కమ్ముకున్న మబ్బులు.. రైతుల గుండెల్లో గుబులు

జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివర్లో అకాల వర్షానికి దెబ్బతింటుందనే ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయి. పత్తితీత కూడా కొనసాగుతోంది. కమ్ముకొచ్చిన కారు మబ్బులను చూసిన రైతన్న గుండె చెదురుతోంది. వర్షం వస్తే చేతికి వచ్చిన వరి, పత్తి తడిసి తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్నారు.