News April 12, 2025
చిట్వేలు: ఆ కాలేజీలో ఒక్కరే పాస్

చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఒకే విద్యార్థిని ఆనందల మల్లిక ఉత్తీర్ణులయ్యారు. 474 మార్కులకు గానూ 294 మార్కులు సాధించారు. 78 మంది పరీక్షలు రాస్తే 77 మంది ఫెయిలయ్యారు. చిట్వేలులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు కానీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ లేకుండానే సంవత్సరం పూర్తి అయిపోయింది. అధికారులు లెక్చరర్లను నియమించాల్సి ఉంది.
Similar News
News April 24, 2025
మైలవరం: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 24, 2025
గద్వాల: కాలువలో మహిళ మృతదేహం లభ్యం

జోగులాంబ గద్వాల పట్టణంలోని అగ్రహారం కాలువలో గుర్తుతెలియని వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందన్నారు. నల్లటి జాకెట్, పింక్ చీర ధరించి ఉందని, ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే గద్వాల పట్టణ పోలీస్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
News April 24, 2025
కొండాపూర్: మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

జిల్లాలో ఈనెల 27న నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. http://telanganams.cgg.gov.in అనే వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.