News April 28, 2024
చిత్తూరుకు రేపు నందమూరి బాలకృష్ణ రాక

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం చిత్తూరుకు రానున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా వస్తున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News October 25, 2025
చిత్తూరు: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు.!

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
News October 25, 2025
కోడి తెచ్చిన తంటా.. ఎనిమిది మందిపై కేసులు

కోడి తెచ్చిన తంటా.. పుంగనూరులో ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. SI రమణ వివరాల మేరకు.. పట్టణంలోని రహ్మత్ నగర్లో పక్కపక్కనే భాస్కర్ నాయుడు, ఖాదర్ వలీ కుటుంబాలు ఉంటున్నాయి. భాస్కర్‌కు చెందిన కోడి ఖాదర్ వలీ ఇంటి వద్ద ఇది వరకు రెట్ట వేయడంతో గొడవ పడ్డారు. శుక్రవారం మరోసారి ఇదే రిపీట్ కావడంతో ఇరుకుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు SI తెలిపారు.
News October 24, 2025
పౌల్ట్రీ రంగ రైతులతో కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని పౌల్ట్రీ రంగం రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రైతులు, కంపెనీలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని వివరించారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాయితీల సక్రమంగా అందించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


