News April 13, 2025
చిత్తూరులొ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

సోమవారం అంబేడ్కర్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News April 14, 2026
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చిత్తూరు కలెక్టర్

అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు దర్గా సర్కిల్‌లో నిర్వహించిన జయంతిలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలో నడిస్తే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
News April 14, 2026
చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.
News April 14, 2026
చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.


