News April 11, 2024

చిత్తూరులో అక్కడ బావ, మరదల పోటీ

image

చిత్తూరు జిల్లాలో జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఈసారి బావ, మరదల మధ్య పోటీ జరగనుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసీపీ జీడీనెల్లూరు MLA అభ్యర్థిగా, ఆయన చెల్లెలు కుమారుడు రమేశ్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. బావ, మరదల పోటీలు ఎవరు గెలుస్తారో చూడాలి మరి. ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా వీఎం.థామస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Similar News

News October 15, 2025

చిత్తూరు: పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

image

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్, జిల్లా పర్యాటక మండల చైర్మన్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కైగల్ జలపాతం, పులిగుండు, కంగుంది ప్రాంతాలతో పాటు మొగిలి దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఐరాల బుగ్గ మడుగు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటకశాఖ ఆర్డి రమణ పాల్గొన్నారు.

News October 15, 2025

కుప్పం RTC డిపో కోసం 15.37 ఎకరాలు

image

కుప్పం RTC డిపో ఏర్పాటుకు ప్రభుత్వం 15.37 ఎకరాలను కేటాయించింది. కుప్పం మున్సిపాలిటీ కమతమూరు రెవెన్యూ పరిధిలో 3.53 ఎకరాలు, గుట్టపల్లి రెవిన్యూ పరిధిలో 11.84 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన భూమిని మంగళవారం DPTO రాము, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కుప్పం ఆర్టీసీ డిపో బస్టాండ్ ఓకే చోటు ఉండగా ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను ఏర్పాటు చేయనున్నారు.

News October 14, 2025

చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు చర్యలు

image

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులకు సహకరించని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలను నిలుపుదల చేయాలని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు.