News February 23, 2025
చిత్తూరులో చికెన్ ధరలు ఇవే..

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.155 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.177గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News February 24, 2025
చిత్తూరు: ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.
News February 23, 2025
వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

చిత్తూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి పారదర్శకంగా రుణాలు మంజూరు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. జేసీ విద్యాధరి, అధికారులు పాల్గొన్నారు.
News February 22, 2025
చిత్తూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక.. ఏపీ CS, DGPకి నోటీసులు
✒ తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ వెదురుకుప్పంలో అగ్ని ప్రమాదం
✒ బెంగళూరు-చెన్నై హైవేపై ప్రమాదం
✒ చిత్తూరులో 19 మందికి జరిమానా
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్