News March 16, 2025

చిత్తూరులో చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలోని పలు దుకాణాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బాయిలర్ కోడి కిలో రూ.114, లేయర్ కోడి రూ.90గా పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. కాగా బాయిలర్ కోడి మాంసం కేజీ. రూ.165, స్కిన్ లెస్ కేజీ రూ.185, లేయర్ కోడి మాంసం కేజీ రూ.153 పలుకుతోంది. మీ ప్రాంతాలలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News November 24, 2025

చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

image

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2025

చిత్తూరు: మట్టి కోసం TDP పరువు తీసేస్తున్నారు..!

image

చిత్తూరు జిల్లాలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పూతలపట్టులో గ్రావెల్ తరలింపు విషయంలో TDP నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారట. ఇదే విషయమై ఐరాలకు చెందిన ఓ TDP కార్యకర్త ఆడియో వైరల్‌గా మారింది. గ్రావెల్ విషయమై TDPలో వర్గాలు ఏర్పడినా MLA మౌనంగా ఉండటాన్ని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. తిరుపతి జిల్లాలోనూ <<18368996>>గ్రావెల్ <<>>తరలింపు జోరుగా జరుగుతోంది.