News July 10, 2024
చిత్తూరులో టీచర్ ఆత్మహత్య

చిత్తూరులో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో షరీఫ్(38) హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.

News October 29, 2025
చిత్తూరు: అంగన్వాడీల్లో CDPO తనిఖీలు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీలను తెరవలేదని Way2Newsలో <<18139694>>వార్త <<>>వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీడీపీవో అరుణశ్రీ స్పందించారు. మండలంలోని అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందు మూడు రోజులు సెలవులు అని చెప్పి.. ఇవాళ తిరిగి ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఈక్రమంలో కాస్త ఆలస్యంగా సెంటర్లను ఓపెన్ చేశారని సీడీపీవో చెప్పారు. అన్ని సెంటర్లలో సిబ్బంది పనితీరు బాగుందన్నారు.