News June 4, 2024
చిత్తూరులో టీడీపీ.. తిరుపతిలో వైసీపీ లీడ్

TDP చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు లీడ్‌లో ఉన్నారు. ఆయనకు 5695 ఓట్లు రాగా 1638 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప బరిలో ఉన్నారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి 2495 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 17,881 ఓట్లు వచ్చాయి. రాజంపేట వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెనుకపడ్డారు. ఇక్కడ నల్లారి కిరణ్ 1336 ఓట్ల లీడ్‌తో ఉన్నారు.
Similar News
News November 21, 2025
బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్‌కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.
News November 21, 2025
చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.


