News May 11, 2024

చిత్తూరులో బార్లు, వైన్ షాపులు బంద్

image

చిత్తూరులోని ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రభుత్వం వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి సీల్ వేయడం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఓపెన్ చేయరాదని నిర్వాహకులకు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 18, 2025

చిత్తూరులో 19, 20న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు 

image

చిత్తూరులో 19, 20 తేదీల్లో ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు.19న మిషన్ వాత్సల్య పథకంలో ఒక కౌన్సిలర్, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, 20న మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న 3 మల్టీపర్పస్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

News February 17, 2025

తిరుపతి నగరంలో దారుణ హత్య

image

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో జగదీశ్ (40)అనే వ్యక్తిని సునీల్ అనే వ్యక్తి హత్య చేశాడు. మద్యం మత్తులో జగదీశ్ భార్యతో సునీల్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సునీల్‌ను ప్రశ్నించడంతో పదునైన ఇనుప చువ్వతో జగదీశ్ గుండెలపై పొడిచాడు. తీవ్రగాయాలైన జగదీశ్‌ను ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!