News June 5, 2024
చిత్తూరులో బుల్లెట్ సురేశ్ రాజీనామా
మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి బుల్లెట్ సురేశ్ రాజీనామా చేశారు. చిత్తూరుకు చెందిన ఆయన మొదటి రెండేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఇటీవల మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నిన్న టీడీపీ గెలవడంతో రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 9, 2024
చంద్రగిరి: మహిళా అనుమానాస్పద మృతి
చంద్రగిరి మండలం ముంగిలపట్టులో కాసేపటి క్రితం ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఓ వ్యక్తితో కలిసి మహిళ ఏడుస్తూ కనిపించింది. చీకటి పడ్డాక నడి రోడ్డుపై రక్తపు మడుగులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2024
తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు
తిరుపతి రైల్వే కాలనీలో వ్యభిచారం కలకలం రేపింది. ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నడుపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓటేరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు అమ్మాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.
News December 8, 2024
తిరుపతి, చిత్తూరుకు రైట్ రైట్ అంటున్న బడా హీరోలు
తెలుగు సినిమా ఉ.చిత్తూరు జిల్లాకు వరుసగా హాయ్ చెబుతోంది. చిత్తూరు నేపథ్యంలో ‘పుష్ప’ ఎంతటి హవా చూపించిందో తెలిసిందే. అంతకన్నాముందు నివేథా థామస్ 35 ఇది చిన్న కథకాదు, శర్వానంద్ శ్రీకారం, కిరణ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ సైతం తిరుపతిలో షూటింగ్ జరిగింది. తమ యాస, భాష సరిహద్దులు దాటుతుందంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.