News February 20, 2025
చిత్తూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు

బ్యాంక్ ఆప్ బరోడాలో 4వేల అప్రెంటీస్ ఉద్యోగాలకు <<15515892>>నోటిఫికేషన్ <<>>వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 59 కేటాయించారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జాం, స్థానిక భాష మీద టెస్ట్ ఉంటుంది. https://bfsissc.com/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News December 4, 2025
మామిడిలో జింకు లోపం – లక్షణాలు

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.
News December 4, 2025
ఖమ్మం: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. రోశయ్య ఆర్థిక, విద్య, వైద్య, రవాణా తదితర శాఖల్లో సేవలందించడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు-కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన మహనీయుడని కలెక్టర్ అన్నారు.
News December 4, 2025
ఈ రైల్వే లైన్ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ: ఎంపీ గంటి

అమలాపురం పార్లమెంటు పరిధిలోని కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ కోరారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆయనకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన రైల్వే లైన్ పనుల గురించి ఆయన మంత్రికి వివరాలు తెలియజేశారు.


