News April 11, 2025

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి

image

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని దురాలోచనలను పోగొట్టడానికి జ్యోతిరావ్ ఫూలే అపారమైన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కన్వీనర్ షణ్ముగం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 10, 2026

పుంగనూరు: బాలికపై రేప్.. నిందితుడికి రిమాండ్

image

పుంగనూరు మండలంలో కొన్ని రోజుల క్రితం ఓ బాలిక చౌక ధరల దుకాణానికి వెళుతుండగా ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ రాంబాబును అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు.

News April 10, 2026

చిత్తూరులో ఉద్యోగుల రక్తదానం

image

చిత్తూరులోని రెవెన్యూ భవనంలో జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు. గ్రామ సచివాలయ సర్వేయర్లు రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వల కొరత ఉందని గుర్తించి ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ పుల్లయ్య, సర్వే ఉద్యోగుల సంఘం నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

News April 10, 2026

చిత్తూరు: ఫేక్ సర్టిఫికెట్లు… ముగ్గురు ఉద్యోగుల తొలగింపు

image

తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో గంగవరం ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ వి.నాగవేణితో పాటు, నాగలాపురం, మదనపల్లెలో మరో ఇద్దరిని తొలగించారు.