News April 25, 2024
చిత్తూరులో 63 నామినేషన్ల దాఖలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713970700880-normal-WIFI.webp)
చిత్తూరు జిల్లాలో బుధవారం 63 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. పార్లమెంటు స్థానానికి 8 నామినేషన్లు వేశారని చెప్పారు. పుంగునూరు అసెంబ్లీకి ఎనిమిది, నగరిలో 9, జీడీనెల్లూరులో 12, చిత్తూరులో పది, పూతలపట్టులో 5, పలమనేరులో 2, కుప్పంలో 7 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 19, 2025
చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737273027725_20345978-normal-WIFI.webp)
ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.
News January 18, 2025
CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737187248974_20345978-normal-WIFI.webp)
చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.
News January 18, 2025
తిరుపతి తొక్కిసలాట పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737177466653_689-normal-WIFI.webp)
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్‌లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.