News October 1, 2024
చిత్తూరులో 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలియజేశారు. నగిరి, యాదమరి, పుంగనూరు మండలాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. బంగారుపాలెం, వీకోట, రామకుప్పం మండలాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి. సాయంత్రం లోపు లక్ష్యాలను చేరుకునేలా పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Similar News
News October 12, 2024
చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా
చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.
News October 12, 2024
TTDపై అభ్యంతరకరంగా పోస్ట్.. వ్యక్తిపై కేసు
TTD ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చైతన్య అనే వ్యక్తిపై తిరుమల 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టు వస్త్రాలను తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News October 12, 2024
మదనపల్లె: రైలు పట్టాలపై డెడ్ బాడీ
రైలు పట్టాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్రకలకలం రేపుతోంది. మదనపల్లె సీటీఎం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని శనివారం వేకువజామున స్థానికులు గుర్తించారు. పట్టాల మధ్యలో మృతదేహం బోర్లపడి ఉంది. పక్కనే ల్యాప్‌టాప్ ఉంది. ఎక్కడైనా చంపి, ఇక్కడికి తీసుకొచ్చి పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.