News August 6, 2024
చిత్తూరు: అగస్తీశ్వరాలయంలో విచారణ

చిత్తూరు నగరంలోని అగస్తీశ్వర ఆలయంలో గత నెల 20 వ తేదీ పూజా సామాగ్రి దొంగతనంపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి విచారణ నిర్వహించారు. దొంగతనం ఘటనపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు గ్రీవెన్స్ లో జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ, VHP సభ్యులు రామ్ భద్ర, చిట్టిబాబు, రామ్మూర్తి, తోటపాళ్యం వెంకటేష్ , సిద్దు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.
News December 6, 2025
చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.


