News September 6, 2024

చిత్తూరు: ‘అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు’

image

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. బస్తాపై ఉన్న ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని, నాసిరకం ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు జారీ చేయాలని, దుకాణాల ఎదుట ధరలు, నిల్వ వివరాలు పొందుపరచాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని తెలిపారు.

Similar News

News November 22, 2025

చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

image

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్‌ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్‌ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.

News November 22, 2025

పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

image

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.

News November 22, 2025

GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

image

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.