News August 23, 2024

చిత్తూరు: అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు : ఎస్.పి

image

ఆరోగ్య సమస్యలను పూజలతో నయం చేస్తామని ఎవరైనా మీ ఇంటికి అపరిచిత వ్యక్తులు వస్తే వారిని నమ్మకండి అని అటువంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్.పి మణికంఠ చందోలు అన్నారు. ఎస్.పి మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల పట్ల సందేహం ఉంటే 100/112 కు లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News September 14, 2024

వరద బాధితులకు తిరుపతి అధికారుల సాయం

image

విజయవాడ వరద బాధితులకు తిరుపతి జిల్లా అధికారులు అండగా నిలిచారు. ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున తమ వంతు సాయం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి రూ.7.47 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు.

News September 13, 2024

ఆచూకీ తెలిస్తే తెలపండి: బంగారుపాళ్యం సీఐ

image

మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అందులో ఐడుగురి వివరాలను గుర్తించారు. పై ఫొటోలో ఉన్న ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. వాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే బంగారుపాళ్యం సీఐను 9440796736లో సంప్రదించాలి. చిత్తూరు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ నెంబర్ 9440900005కు కాల్ చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో కోరారు.

News September 13, 2024

వైసీపీ PAC మెంబర్‌గా పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగాను అవకాశం కల్పించారు. మరోవైపు మాజీ మంత్రి రోజా, తిరుపతి మాజీ MLA భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి.