News April 12, 2025

చిత్తూరు: అప్పుడు.. ఇప్పుడూ లాస్టే

image

ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలవగా.. గతేడాది సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో అట్టడగున నిలిచింది. 2024లో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 10,882 మంది పరీక్షలు రాయగా.. 6,817 మంది పాసై 63 శాతం పర్సంటేజీతో 26వ స్థానానికి జిల్లా పరిమితమైంది. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 13,183 మందికి 7,168 మందే పాస్(54%) కావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే లాస్ట్ స్థానంలో నిలిచింది.

Similar News

News April 17, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్ 

image

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.

News April 17, 2025

చిత్తూరు: ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో రేషన్ పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధిక శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 17, 2025

CTR: మీరు ఇలా చేయకండి

image

చిత్తూరు సంతపేటలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజా ‘defabet sports’ యాప్‌లో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. లాభాలు రావడంతో ఆశపడి భార్య నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును యాప్‌లో పెట్టి పోగొట్టాడు. వారం వ్యవధిలోనే నాలుగైదు రూ.లక్షలు నష్టపోయాడు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగినట్లు తెలిస్తే చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని SP మణికంఠ  సూచించారు.

error: Content is protected !!