News February 14, 2025

చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

image

చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు. 

Similar News

News March 12, 2025

పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

image

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

News March 12, 2025

K.V.N చక్రధరబాబుకు చిత్తూరు జిల్లా బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా ప్రత్యేకాధికారిగా K.V.N చక్రధరబాబు IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.

News March 12, 2025

యువతిపై అత్యాచారం.. నలుగురి అరెస్ట్ 

image

కార్వేటినగరం మండలంలో అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో అమ్మాయిని బలవంతం చేసిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపిశెట్టిపల్లి పెద్దహరిజనవాడకు చెందిన  నాగరాజు, దినేశ్, పవన్ కుమార్, జయరాంను నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!