News July 19, 2024
చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.
Similar News
News December 13, 2024
చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.