News June 16, 2024
చిత్తూరు: ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న దాడి

ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న కర్రతో దాడిచేసిన ఘటన నిమ్మనపల్లెలో జరిగింది. SI లోకేష్ రెడ్డి కథనం.. మండలంలోని పారేసువారిపల్లెకు చెందిన రామకృష్ణ, అతని చెల్లి మనోహర్ భార్య రమాదేవి(40) అదే గ్రామంలో ఉంటుంది. తల్లిదండ్రులు పసుపు కుంకుమకు ఇచ్చిన 2 ఎకరాలను తనకు ఇవ్వాలని శనివారం రాత్రి రమాదేవి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రామకృష్ణ తన చెల్లెలుపై కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరచగా ఆస్పత్రికి తరలించారు
Similar News
News January 19, 2026
కుప్పం: చెరువులో పడి మహిళ ఆత్మహత్య

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని NTR కాలనీకి చెందిన చలపతి భార్య ప్రభావతమ్మ (54) చీలేపల్లి చెరువులో పడి మృతి చెందింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆమె ఆదివారం చెరువులో పడినట్లు స్థానికులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
చిత్తూరు: ఉద్యోగాల పేరుతో మోసం

సర్వ శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసం చేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. https://sarvashikshaabhiyan.com/jobs.php వెబ్ సైట్ ప్రభుత్వానికి చెందినది కాదని… దీనితో సర్వ శిక్ష అభియాన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ప్రకటించిన ఉద్యోగాల పట్ల ప్రజలు మోసపోరాదని తెలియజేశారు. ఎవరు మోసానికి గురికారాదని సూచించారు.