News March 22, 2024
చిత్తూరు: ఆ 4 చోట్ల మహిళలు గెలవలేదు..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.
Similar News
News September 16, 2024
ఎర్రావారిపాళెం: ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతం
ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతమని మెక్సికో ప్రతినిధులు ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఉదయ మాణిక్యం గ్రామంలో వారు పర్యటించారు. మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు పర్యటించారు. ఉదయ మాణిక్యం గ్రామంలో గ్రామ ఐక్య సంఘ ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ అమలులో తమ పాత్రను వివరించారు.
News September 16, 2024
చిత్తూరు జిల్లాకు రాష్ట్రంలో 8వ స్థానం
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ కేవైసీ నమోదు ఆదివారంతో ముగిసిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటి వరకు 2,38,611 ఎకరాల్లో ఈ-పంట నమోదు చేసి 98.53 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 3,563 ఎకరాల్లో ఈకేవైసీ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈకేవైసీలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు.
News September 16, 2024
తిరుపతి: I7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
తిరుపతి పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈనెల 17వ తేదీ నుంచి రెండో విడత పీజీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మొదటి విడత పీజీ కౌన్సిలింగ్ లో హాజరుకాని విద్యార్థినులు రెండో విడత కౌన్సిలింగ్ కి హాజరుకావాలని కోరారు. పీజీసెట్ లో అర్హత సాధించిన విద్యార్థినులు తమకు కావాల్సిన కోర్సును వెబ్ ఆప్షన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.