News July 12, 2024
చిత్తూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు దరఖాస్తులు

అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు జిల్లాలో ఆసక్తిగల యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మజ తెలిపారు. పూర్తి వివరాలకు https://agnipathvayyu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె కోరారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. 6వ స్థానంలో CM చంద్రబాబు

CM చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ఇతర మంత్రులతోపోటీ పడి 6వ స్థానంలో నిలిచారు. కాగా చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖను చూస్తున్న విషయం తెలిసిందే. మరింత వేగంగా పని చేయాలని CM మంత్రులను ఆదేశించారు.
News February 6, 2025
నీటి ఎద్దడిపై చిత్తూరు కలెక్టర్ సమీక్ష

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
News February 6, 2025
పలమనేరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.