News August 20, 2024
చిత్తూరు: ఈ నెల 21న భారత్ బంద్
SC వర్గీకరణ తీర్పు కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని రామసముద్రం మండలం మాలమహానాడు అధ్యక్షుడు టి. కృష్ణప్ప తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు “యమాల సుదర్శన్, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివయ్య ఆదేశాల మేరకు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్క మాల జాతి, అనుబంధ సంఘాలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News September 9, 2024
శ్రీవారి ఆలయ పేష్కార్‌గా రామకృష్ణ
తిరుమల శ్రీవారి ఆలయ నూతన పేష్కార్‌గా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఆలయ రంగనాయకుల మండపం వద్ద బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
News September 9, 2024
చిత్తూరు: విద్యార్థి దారుణ హత్య..?
ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
News September 9, 2024
సగం జీతం సాయం చేసిన తిరుపతి కలెక్టర్
విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.