News April 10, 2024
చిత్తూరు: ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్

జిల్లాలో ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ వెల్లడించారు. తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎస్పీ మణికంఠ, డీఆర్వో పుల్లయ్యతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులకు హాజరవుతున్న 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించామన్నారు.
Similar News
News March 11, 2026
అమరావతికి వెళ్లిన చిత్తూరు కలెక్టర్

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి వెళ్లారు. కలెక్టర్ తిరిగి వచ్చే వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 13 నుంచి సుమిత్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
News March 11, 2026
చిత్తూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

యుద్ధం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోనూ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుకింగ్ OTP ఉంటేనే సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాతే సిలిండర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కష్టాలు లేకపోయినా పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు తప్పేటట్లు లేదు.
News March 11, 2026
CTR: జాతరకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పెద్దపంజాణి మండలం కమ్మినాయనపల్లికి చెందిన భరత్(20), శ్రీధర్(22), గిరి బైకుపై పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చారు. తిరిగి మంగళవారం రాత్రి ఇంటికి బయల్దేరారు. మాదనపల్లె క్రాస్ వద్ద బైకు, బొలేరో ఢీకొన్నాయి. భరత్, శ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. గిరి తీవ్రంగా గాయపడ్డాడు.


