News February 19, 2025

చిత్తూరు : ఊరిస్తున్న మామిడి పూత

image

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పూత ఎక్కువగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు పూత నిలవడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. మూడో సారీ మందులు వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా తేనే మంచు పురుగు కనిపిస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలిస్తే దిగుబడి 70 శాతం వరకు రావొచ్చని రైతులు అంటున్నారు.

Similar News

News December 20, 2025

చిత్తూరు: తగ్గుతున్న చెరకు సాగు

image

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వాణిజ్య పంటగా ఉన్న చెరకు సాగు క్రమేపి తగ్గుతోంది. సాగు వ్యయం అధికమవుతుండడం, కూలీలు దొరక్క పోవడం, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు క్రమేపి ఇతర పంటలకు మల్లుతున్నారు. సాగు చేసిన వారు తప్పనిసరిగా బెల్లం తయారు చేయాల్సి వస్తోంది. 2020లో ఉమ్మడి జిల్లాలో 9,900 హెక్టార్లలో చెరకు సాగు కాగా.. ప్రస్తుతం 6,500 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది.

News December 20, 2025

చిత్తూరు: ‘బాలికను గర్భిణీని చేశాడు’

image

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోక్సో కేసులో అరెస్ట్ చేసినట్టు నగిరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలోని 14 ఏళ్ల బాలికపై మురళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో గర్భం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

News December 19, 2025

చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

image

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.