News June 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల

image

జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాయని డీఈవో దేవరాజు తెలిపారు. ఈ www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు మెరిట్ కార్డులు త్వరలో రాష్ట్రం నుంచి జిల్లా కార్యాలయానికి వస్తాయని చెప్పారు. ఉపకార వేతనాలకు అర్హత సాధించిన విద్యార్థులు తమ తల్లి లేక తండ్రితో ఏదైనా జాతీయ బ్యాంకులో జాయింట్ ఖాతా తెరవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

image

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్‌, 251 మంది డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.

News November 17, 2025

చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

image

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.