News January 24, 2025

చిత్తూరు ఎస్పీకి ఉత్తమ జాతీయ అవార్డు

image

గత అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణ జాతీయ అవార్డుకు ఆయన సెలెక్ట్ అయ్యారు. విజయవాడలో 25న జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎస్పీ అవార్డు వచ్చిందని పలువురు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 18, 2025

కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

image

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

image

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

News September 18, 2025

కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

image

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.