News October 29, 2024

చిత్తూరు ఎస్పీ కీలక సూచన

image

అక్రమంగా టపాకాయలు విక్రయించిన, నిల్వ చేసిన డయల్ 112 కు లేదా 9440900005 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. దీపావళి రోజు ప్రభుత్వ నిబంధనలకు లోబడి టపాకాయలు విక్రయించాలన్నారు. ‘గ్రీన్ క్రాకర్స్’ పేరుతో నిషేధిత టపాకాయలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 2, 2024

తిరుపతి జిల్లాలో దారుణం

image

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన బాలిక(3)ను అదే ఏరియాకు చెందిన సుశాంత్ (22) చాక్లెట్లు ,లేస్ ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపాడు. గ్రామంలోని స్కూలు వెనుక పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత పూడ్చిపెట్టాడు. బాలిక కనబడలేదని తల్లిదండ్రుల ఫిర్యాదుతో వడమాలపేట పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.

News November 2, 2024

పెద్దిరెడ్డికి స్టేషన్ బెయిల్

image

పుంగనూరు అల్లర్ల కేసులో A1గా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టుకు వెళ్లగా ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి పలమనేరు DSP కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు. డీఎస్పీ ప్రభాకర్ రావుకు ష్యూరిటీలను సమర్పించడంతో ఆయన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.

News November 2, 2024

తిరుపతి: పెన్షన్ తీసుకోని వారు అందుబాటులో ఉండండి: కలెక్టర్

image

తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పండుగ వాతావరణంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో 2,65,488 మందికి 5295 మంది సచివాలయ సిబ్బంది ద్వారా రూ.112.37 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. ఏదేని కారణం చేత పెన్షన్ల నేడు తీసుకోలేని వారికి  2వ తేదీన పంపిణీ చేస్తామని వారు వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలన్నారు.