News March 22, 2025
చిత్తూరు: ఒకరి ప్రాణం కాపాడిన SI

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు.
Similar News
News November 11, 2025
మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.
News November 11, 2025
పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
News November 11, 2025
చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


