News October 30, 2024

చిత్తూరు: ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

image

చిత్తూరు జిల్లాకు సంబంధించి 2025 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు డిఆర్ఓ పుల్లయ్య మంగళవారం తెలిపారు. అభ్యంతరాలపై నవంబర్ 28 వరకు క్లైములు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 12 లోపు వాటిని పరిష్కరిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,66,502 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషులు 7,71,264 మంది, మహిళలు 7,95,165 మంది, ఇతరులు 73 మంది ఉన్నారన్నారు.

Similar News

News October 30, 2024

పుంగనూరు: బాలికపై అత్యాచారం..

image

బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను చౌడేపల్లె మండలం పి.బయప్పల్లెకు చెందిన చరణ్ (23), పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన బి.భార్గవ్ సహకారంతో తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సీఐ తెలిపారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

News October 30, 2024

తిరుపతి IITలో ఉద్యోగావకాశం

image

తిరుపతి IITలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంటర్న్- 04 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్(MLISC) పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు www.iittp.ac.in చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 30.

News October 30, 2024

చిత్తూరు: ఆవుపై చిరుత పులి దాడి..?

image

సోమల మండలం ముగ్గురాళ్ల వంక వద్ద ఆవుపై ఓ అడవి జంతువు దాడి చేసింది. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయింది. ఆవుకు తీవ్ర రక్తస్రావమైంది. దాడి చేసింది చిరుత పులేనని స్థానికులు తెలిపారు. రాత్రి వేళ ఇలా జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దాడి చేసింది చిరుత పులేనా? లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.