News October 30, 2024
చిత్తూరు: ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

చిత్తూరు జిల్లాకు సంబంధించి 2025 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు డిఆర్ఓ పుల్లయ్య మంగళవారం తెలిపారు. అభ్యంతరాలపై నవంబర్ 28 వరకు క్లైములు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 12 లోపు వాటిని పరిష్కరిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,66,502 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషులు 7,71,264 మంది, మహిళలు 7,95,165 మంది, ఇతరులు 73 మంది ఉన్నారన్నారు.
Similar News
News July 5, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్‌పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.
News July 5, 2025
చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్‌కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.
News May 8, 2025
మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.